![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీతో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -441 లో..... ఇప్పుడు చెప్పండి ఎప్పటి నుండి జరుగుతుంది. ఈ భాగోతం ఇంట్లో ఉన్న భార్యని ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఈ అప్పుని ఏం చేద్దాం అనుకుంటున్నారు. స్నేహమా? ప్రేమా? మరేదైనా పేరా దీనికి ఏ పేరు పెట్టాలి వీళ్లిద్దరు హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికారని అనామిక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది.
ఎన్ని రోజులగా సాగుతుందంటూ కళ్యాణ్ ని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ధాన్యలక్ష్మి తొందరపడకు.. అనవసరంగా కొడుకుని అపార్థం చేసుకుంటే ఎలా ఉంటుందో.. నాకు ఇప్పుడు అర్థమైందని అపర్ణ అంటుంది. అవును కళ్యాణ్ తప్పు చేసే మనిషి కాదు మనమే మన కొడుకుని నమ్మకుంటే ఎలా అని ప్రకాష్ అనగానే.. మా అప్పు కూడా తప్పు చెయ్యదని స్వప్న అంటుంది.. మీరు ఎలా ఈ ఇంటికి కొడలు అయ్యారో అప్పుని కూడా ఈ ఇంటికి కోడలు చెయ్యాలని కనకం ఎంత ట్రై చేసిందో తెలుసు కదా అనామిక అనగానే.. నువ్వు ఎలా ఈ ఇంటికి కొడలు అయ్యావో కూడా తెలుసు.. కవి గారి వెంట పడి.. ఈ ఇంటికి కోడలు అయ్యావని కావ్య అంటుంది. అనామిక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే నిందలు పడే అవసరం నాకు లేదని కళ్యాణ్ అంటాడు. నేను కళ్యాణ్ ని ప్రేమించింది గతం అంతే.. ఇప్పుడు మా మధ్య స్నేహం మాత్రమే.. ప్రతీసారీ ఈ అనామిక మాకు సంబంధం అంటగడుతుంది. నాకు కోపం వస్తుంది కానీ సైలెంట్ గా ఉంటున్నా ఎందుకంటే మా ఇద్దరు అక్కలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉంటారని అప్పు అంటుంది. ఆ తర్వాత అప్పు గురించి ధాన్యలక్ష్మి తప్పుగా మాట్లాడుతుంటే అప్పుడే కనకం వచ్చి తిడుతుంది.
వీళ్ళు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నాను కానీ అక్కడికి ఎందుకు వెళ్లారో చెప్పాలిసిన అవసరం ఉందని రాజ్ అంటాడు. దాంతో కావ్య జరిగిందంతా చెప్తుంది. అసలు మాయ కోసం మేం ముగ్గురం వెళ్ళాం అంతలో మీడియాతో అనామిక, ధాన్యలక్ష్మి వచ్చారని కావ్య చెప్పగానే.. అదంతా అబద్ధమని అనామిక అంటుంది. ఇంకెప్పుడు కళ్యాణ్, అప్పులు కలవకూడదని కనకం చెప్పి.. అప్పుని తీసుకొని వెళ్తుంది. దొరికిపోయిన తర్వాత ఎన్ని అయిన చెప్తారు.. నేను నమ్మను.. భార్య ఉండగా ఇంకొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటావ్.. కళ్యాణ్ నీకు ఎవరి బుద్ది వచ్చిందో ఏంటోనని సుభాష్ ని చూస్తూ అనగానే ఇందిరాదేవి అనామికని తిట్టి లోపలికి పంపిస్తుంది. తరువాయి భాగంలో కావ్య, రాజ్ లు వెళ్తుంటే.. మాయని రౌడీలు వెంబడిస్తూ ఉండడం చూస్తుంది కావ్య. దాంతో ఆ విషయం రాజ్ కి చెప్తుంది. మాయని సేవ్ చేసి అసలు నిజం అందరి ముందు చెప్పమంటుంది కావ్య . ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |